K Kavitha: అన్న కేటీఆర్ ను ఉద్దేశించి కవిత భావోద్వేగ ట్వీట్

Kavitha emotional tweet on KTR
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేటీఆర్
  • అన్నకు రాఖీ కట్టలేకపోయిన కవిత
  • అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా 'అన్న' అని ట్వీట్
రక్షా బంధన్ సందర్భంగా తన అన్న కేటీఆర్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగమైన ట్వీట్ చేశారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా 'అన్న' కేటీఆర్ అని ఆమె అన్నారు. తన అన్న తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ కుటుంబ సమేతంగా అమెరికాలో ఉన్నారు. దీంతో, ఈ ఏడాది తన అన్నకు ఆమె రాఖీ కట్టలేక పోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. తన కజిన్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కవిత రాఖీ కట్టారు. 
K Kavitha
KTR
BRS

More Telugu News