Vivek: కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారనే వార్తలపై వివేక్ స్పందన

I am not joining Congress says BJP leader Vivek
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్న వివేక్
  • కాంగ్రెస్ నేతలతో తాను టచ్ లో లేనని వ్యాఖ్య
  • తాను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయని మండిపాటు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీని వీడుతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ స్పందిస్తూ... ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులతో తాను టచ్ లో లేనని చెప్పారు. ఇటీవల తాను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయని చెప్పారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రెండు రోజులుగా తాను పూణేలో ఉన్నానని తెలిపారు.
Vivek
BJP
Congress

More Telugu News