Chandrababu: గొట్టిపాళ్లలో టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో జరిగిన దాడులపై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu serious on YSRCP attacks with weapons on TDP workers
  • పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి
  • మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
  • వైసీపీ గూండాలు మారణహోమం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా, మారుణాయుధాలతో జరిగిన దాడిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నేతలను అడిగి సమాచారం తెలుసుకున్నారు. దాడుల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు. గ్రామంలో వైసీపీ గూండాలు ఇళ్లపై పడి గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే నివారించలేక పోవడం పోలీసుల వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు పోలీసులు ఇస్తున్న మద్దతే ఈ తరహా ఘటనలకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News