TTD: టీటీడీ బోర్డు సభ్యులుగా ఆ ముగ్గురి నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

Chinta Venkateshwarlu challenges sharath chandra reddy as ttd board member
  • టీటీడీ బోర్డు సభ్యులుగా సామినేని, కేతన్, శరత్ చంద్రారెడ్డి
  • వీరిని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చింతా వెంకటేశ్వర్లు
  • కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని వెల్లడి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం పిల్ దాఖలైంది. నేర చరిత్ర కలిగిన మద్యం వ్యాపారులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 

ఇటీవల టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డిల నియామకాలను ఆయన సవాల్ చేశారు. వీరిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఇది కోట్లాది మంది వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News