షర్మిల పార్టీలో చేరే అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుంది: మాణిక్‌రావు ఠాక్రే
- సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఠాక్రే
- కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామని వెల్లడి
- ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని హామీ
కాగా, కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కానుంది. ఇటీవలి వరకు పోటీ చేసే ఆశావహుల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ జాబితాను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే దిశగా అడుగులు వేయనుంది. సర్వేల ఆధారంగా, సామాజిక కోణం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థుల జాబితాను పరిశీలించి, స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేస్తుంది. సెప్టెంబర్ మూడో వారంలో అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చునని తెలుస్తోంది.