Elon Musk: లింక్డ్ ఇన్ కంటే ఈ మెయిల్ నయం: ఎలాన్ మస్క్

  • లింక్డ్ ఇన్ మరీ దయనీయమన్న మస్క్
  • కొన్ని సందర్భాల్లో దాన్ని వినియోగించుకోలేమన్న ఎక్స్ బాస్
  • లింక్డ్ ఇన్ కు పోటీగా ఎక్స్ హైరింగ్స్
Elon Musk calls LinkedIn a cringe fest says even emails are better way to connect than LinkedIn

టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘లింక్డ్ ఇన్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ హైరింగ్స్ పేరుతో ఓ కొత్త ఫీచర్ ను ఎలాన్ మస్క్ ప్రారంభించారు. కంపెనీలు ఎక్స్ హైరింగ్ పై జాబ్స్ పోస్టింగ్ లు చేసుకోవచ్చు. నిపుణులతో కూడిన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. లింక్డ్ ఇన్ ఆఫర్ చేసే సేవలను ఎక్స్ పైనా అందుబాటులోకి తెచ్చేశారు మస్క్. ఈ సందర్భంగా లింక్డ్ ఇన్ ప్లాట్ ఫామ్ ను దయనీయమైనదిగా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఎక్స్ హైరింగ్స్ అనే ఫీచర్ ఎంపిక చేసిన సంస్థలకే అందుబాటులోకి వచ్చింది. బీటా వెర్షన్ లో ఉన్న దీనిని పరీక్షల అనంతరం త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. దీని ద్వారా కంపెనీలు హైరింగ్ (నియామకాలు) సులభంగా చేసుకోవచ్చని ఎక్స్ చెబుతోంది. 

ఇయాన్ జెల్బో అనే వ్యక్తి ఎక్స్ పై ‘లింక్డ్ ఇన్ కంటే దారుణమైన ప్లాట్ ఫామ్ మరేదైనా ఉందా?’ అని ప్రశ్న సంధించారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందించారు. ‘‘కొందరు కొన్ని సందర్భాల్లో నాకు లింక్డ్ ఇన్ లింక్స్ పంపిస్తుంటారు. అసౌకర్యంగా ఉండడంతో నేను దీన్ని వినియోగించుకోలేకపోతున్నాను. దీంతో రెజ్యూమే లేదా బయోడేటాను మెయిల్ చేయాలని వారిని కోరుతున్నాను. లింక్డ్ ఇన్ కు పోటీగా ఎక్స్ అందించే ప్లాట్ ఫామ్ కూల్ గా ఉంటుందని హామీ ఇస్తున్నాం’’ అని మస్క్ పేర్కొన్నారు.

More Telugu News