Janhvi Kapoor: మొదటి బంధం ఎందుకు ముక్కలైందో చెప్పిన జాన్వీ కపూర్ 

Janhvi Kapoor reveals why she had to end her 1st serious relationship
  • బోయ్ ఫ్రెండ్ తో రహస్యంగా కలిసేదాన్నన్న జాన్వీ 
  • అమ్మానాన్నల వద్ద అబద్ధాలు ఆడాల్సి వచ్చేదన్న నటి
  • తనకు బోయ్ ఫ్రెండ్ ఉండడం వారికి ఇష్టం లేదని వెల్లడి
ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మొదటి బోయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ ఎందుకు ముక్కలైందో వెల్లడించింది. తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ తన బోయ్ ఫ్రెండ్ ను ఆమోదించలేదని జాన్వీ తెలిపింది. స్వైప్ రైడ్ అనే టాక్ షో తాజా ఎపిసోడ్ లో భాగంగా ఈ విషయంపై జాన్వీ కపూర్ నోరు విప్పింది.

‘‘నా మొదటి సీరియస్ బోయ్ ఫ్రెండ్ ని రహస్యంగా కలుసుకునే దాన్ని. నిజానికి మేము ఇద్దరం ఒకరి విషయంలో మరొకరు అబద్ధాలతో ఉండేవాళ్లం. దురదృష్టవశాత్తూ ఆ రిలేషన్ షిప్ ముగిసిపోయింది. ఎందుకంటే నేను చాలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. నాకు బోయ్ ఫ్రెండ్ ఉండకూడదన్నట్టు అమ్మా నాన్నలు చెప్పేవారు. దాంతో తల్లిదండ్రుల ఆమోదం, వారితో నిజాయతీగా ఉండడం వల్లే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నాను. ఇది తమ నిర్ణయాల పట్ల మరింత నమ్మకంగా ఉండేలా చేస్తుంది’’ అని జాన్వీ కపూర్ తెలిపింది.

మరోవైపు జాన్వీ కపూర్ ఇటీవలే బావల్ సినిమాలో నటించగా, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలసి కొరటాల శివ రూపొందిస్తున్న దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు కూడా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా నటించనున్నారు.
Janhvi Kapoor
Boy freind
serious relationship
break up

More Telugu News