చంద్రమండలాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహరాజ్
- ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును ప్రకటించకముందే ఈ చర్య చేపట్టాలని సూచన
- ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సలహా
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించిన అనంతరం ఈ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కూడా పేర్కొన్నారు. కాగా, స్వామి చక్రపాణి మహరాజ్ గతంలోనూ తన వింత వ్యాఖ్యలతో కలకలం రేపారు. కొవిడ్ తొలి వేవ్ సమయంలో ‘గోమూత్ర పార్టీ’ నిర్వహించి సంచలనం సృష్టించారు.