CCS Rajender: పట్టుబడిన డ్రగ్స్‌ను అమ్మే యత్నం.. సైబర్ క్రైం ఎస్సై రాజేందర్ అరెస్ట్

Hyderabad CCS SI Arrested For Trying To Sell Drugs
  • గతంలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి విధుల నుంచి సస్పెండైన ఎస్సై రాజేందర్
  • ఆ తర్వాత స్టే తెచ్చుకుని సీసీఎస్‌లో విధులు
  • నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొంతమొత్తం నొక్కేసి అమ్మకానికి యత్నం
  • అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించిన నార్కోటిక్ విభాగం అధికారులు
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను విక్రయించేందుకు యత్నించిన ఎస్సైని తెలంగాణ నార్కోటిక్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో రాయదుర్గం ఎస్సైగా పనిచేసిన రాజేందర్ అవినీతి కేసులో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో అతడిని సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత స్టేతో బయటకు వచ్చినప్పటి నుంచి సైబరాబాద్ సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొంతమొత్తాన్ని దాచిపెట్టి విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు నార్కోటిక్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రాజేందర్‌ను పక్కాగా వలవేసి ఆయన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 1,750 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
CCS Rajender
Hyderabad
Narcotics Control Bureau

More Telugu News