Allu Arjun: 'మై బ్రదర్..' అంటూ చెర్రీకి.. 'బావా' అంటూ జూ.ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ ట్వీట్

Allu Arjun congratulates national award winners
  • అవార్డు గెలిచిన అందరికీ అభినందనలు తెలిపిన అల్లు అర్జున్
  • అలియాభట్, కృతిసనన్‌లపై స్టైలిష్ స్టార్ ప్రశంసలు
  • రాకెట్రీ సినిమాకు మాధవన్ జీవం పోశాడని కితాబు
  • జాతీయ అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపిన అల్లు అర్జున్

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్.. అవార్డు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. ఈమేరకు సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. గుంగుభాయి కతియావాడిలో నటనకు అలియాభట్‌కు, మిమిలో నటించిన కృతిసనన్‌లకు జాతీయ ఉత్తమ నటీమణులుగా అవార్డు వచ్చింది. ఈ అవార్డుకు మీరు అర్హులు అంటూ అల్లు అర్జున్ ప్రశంసించారు. సంజయ్ లీలా బన్సాలీ, ప్రీతిషీల్‌లకు అభినందనలు తెలిపారు.

నంబినారాయణ్ జీవితచరిత్ర ఆధారంగా తీసిన 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్' సినిమాకు కూడా జాతీయ అవార్డు వచ్చింది. స్ఫూర్తిదాయకమైన కథకు నటుడు మాధవన్ జీవం పోశారని, అవార్డు రావడం నిజంగా అభినందనీయమన్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న శ్రేషా టీమ్‌కు, ఐదు నేషనల్ అవార్డులు గెలుచుకున్న సర్దార్ ఉధమ్ బృందానికి అభినందనలు తెలిపారు.

అంతకుముందు, 6 అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఉప్పెన, 'కొండపొలం' గీత రచయిత చంద్రబోస్ తదితరులకూ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు రామ్ చరణ్‌ను మై బ్రదర్ అంటూ, జూనియర్ ఎన్టీఆర్‌ను మా బావా అంటూ ప్రస్తావించారు. నిన్న జూ.ఎన్టీఆర్ కూడా అవార్డు గెలుచుకున్నందుకు అల్లు అర్జున్ బావా అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News