Allu Arjun: ఆనందంతో భార్యను హత్తుకున్న అల్లు అర్జున్.. వీడియో ఇదిగో!

Allu Arjun hugs his wife while celebrating his national award
  • జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
  • 'పుష్ప' చిత్రంలో అత్యుత్తమ నటనకు అవార్డ్
  • ఇప్పటి వరకు మరే తెలుగు నటుడు సాధించని ఘనత

తెలుగు సినీ పరిశ్రమలో మరే నటుడు సాధించలేని ఘనతను అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును బన్నీ సాధించాడు. దాదాపు ఏడు దశాబ్దాల సినీ చరిత్రలో ఈ అవార్డును మరే తెలుగు నటుడు సాధించలేదు. బన్నీకి అవార్డు రావడంతో ఆయన ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టరాని ఆనందంతో బన్నీ తన భార్య స్నేహారెడ్డిని గట్టిగా హత్తుకున్నాడు. ప్రేమతో తన అర్ధాంగికి బుగ్గపై ముద్దు పెట్టాడు. తన కొడుకు, కూతురు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో తన విజయాన్ని ఎంజాయ్ చేశాడు.

  • Loading...

More Telugu News