Pushpa: 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్‌కు అవార్డుల పంట

  • ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ఉప్పెన
  • కొరియోగ్రఫీ, మ్యూజిక్ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్
  • జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్
69th National Film Awards allu arjun best actor

69వ జాతీయ సినిమా అవార్డులను గురువారం ప్రకటించారు. 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.

ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన,
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప),
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), 
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ - కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ కొరియాగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గీత రచయిత - చంద్రబోస్ (కొండపొలం),
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ - శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆర్ఆర్ఆర్,
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - కాలభైరవ (ఆర్ఆర్ఆర్, కొమురం భీముడో),

జాతీయ సమగ్రతా చిత్రం - ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ చిత్రం - రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) - శ్రేయా ఘోషల్
ఉత్తమ దర్శకుడు - గోదావరి
ఉత్తమ నటి - కీర్తి సనన్ (మిమి), అలియా భట్ (గంగుభాయ్ కతియావాడి)
ఉత్తమ సహాయ నటుడు - పంకజ్ త్రిపాఠి (మిమి)
ఉత్తమ సహాయ నటి - పల్లవి జోషి
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ - భావిన్ రాబారీ(చెల్లూ షో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - సర్దార్ ఉధమ్
ఉత్తమ డైలాగ్ రచయిత - గంగుభాయ్ కతియావాడి

More Telugu News