ఏడేళ్ల తర్వాత పంచదార ఎగుమతులపై పూర్తి నిషేధం విధించబోతున్న భారత్!
- అక్టోబర్ నుంచి ప్రారంభమయ్య సీజన్ లో పంచదార ఎగుమతులపై నిషేధం
- వర్షాభావం వల్ల కర్ణాటక, మహారాష్ట్రలో తగ్గిన చెరుకు ఉత్పత్తి
- దేశంలో సగానికి పైగా చెరుకును పండిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర
సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత సీజన్ లో 6.1 మిలియన్ టన్నుల పంచదార ఎగుమతికి మాత్రమే షుగర్ మిల్లులకు అనుమతి ఉంది. మరోవైపు గత సీజన్ లో రికార్డు స్థాయిలో 11.1 మిటియన్ టన్నుల పంచదార మన దేశం నుంచి ఎగుమతి అయింది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకును ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో సగానికి పైగా చెరుకు ఈ రెండు రాష్ట్రాల్లో పండుతుంది. అయితే ఈ రుతుపవనాల సీజన్ లో ఈ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతంలో 50 శాతం వర్షం మాత్రమే కురిసింది. ఇది చెరుకు పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చెరుకు ఉత్పత్తి తగ్గడం వల్లే పంచదార ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించబోతోంది.