Elon Musk: కాస్త ఆలస్యమైంది.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్!

Longer Than I Expected Says Elon Musk On Wager Chiefs Death
  • ఊహించినదానికన్నా కాస్త ఆలస్యమైందన్న మస్క్
  • ప్రిగోజిన్ విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో స్పందించిన ఎలాన్ మస్క్

రష్యాలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా మారడమే ప్రిగోజిన్ మరణానికి కారణమైందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు. తాజాగా స్పేస్ ఎక్స్ అధినేత, ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ కూడా ప్రిగోజిన్ మరణంపై స్పందించారు.

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన మరణాన్ని తాను ముందే ఊహించాననీ, అయితే కొంత ఆలస్యం జరిగిందంటూ ట్వీట్ చేశారు. పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన తర్వాత ప్రిగోజిన్ కు మరణం తప్పదని ఊహించినట్లు మస్క్ తెలిపారు. విమాన ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగేందుకు స్వల్ప అవకాశాలు లేకపోలేదని తన ట్వీట్ లో మస్క్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News