మాజీ భర్తపై రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు
- తన న్యూడ్ వీడియోలను దుబాయిలో విక్రయించాడన్న రాఖీ
- బాత్ రూమ్ లో ఉండగా షూట్ చేశాడని ఆరోపణ
- ప్రపంచమంతా తనను చూసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్న
దీంతో ఆగ్రహించిన రాఖీ సావంత్ మరో అడుగు ముందుకు వేసి.. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు దుబాయిలో విక్రయించాడని ఆరోపించింది. ‘‘నేను బాత్ రూమ్ లో ఉన్నాను. అతడు షూట్ చేశాడు. అలాంటివి బోలెడు వీడియోలు ఉన్నాయి. నా శరీరం మొత్తం న్యూడ్ గా కనిపిస్తోంది. నేను అతడి భార్యను. అతడు నాపై అత్యాచారం చేశాడు.
వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచం అంతా నా వీడియోలను చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచానికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను సాధారణ అమ్మాయిని కాదు. భారత్ లో సెలబ్రిటీని. విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలా?’’ అంటూ రాఖీ సావంత్ వాపోయింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు ఆదిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయగా, అతడు ఇటీవలే విడుదలయ్యాడు. ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడుతూ రాఖీపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు.