Pavan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఇదే!

Ustaad Bhagath Singh Movie Update
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ తో గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్, అప్పటి నుంచి ఆయనతో మరో సినిమా చేయాలని చూస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ఈ మధ్యనే పట్టాలెక్కింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. 

ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరువుకుంది. 'బ్రో' సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో, పవన్ ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇవ్వడం వలన కొంత గ్యాప్ వచ్చింది. తదుపరి షెడ్యూల్ ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మొదలుపెడుతున్నారు. పవన్ సరసన నాయికగా శ్రీలీల కనిపించనుంది. 

ఈ ఇద్దరితో పాటు ముఖ్య పాత్రధారులు ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నారని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తున్న ఈ సినిమాలో, పొలిటికల్ సెటైర్లు ఎక్కువగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రల్లో అశుతోష్ రాణా .. నవాబ్ షా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
Go Back to Shorts
Pavan Kalyan
Sreeleela
Ashutosh Rana
Nawab Shah

More Telugu News