Rajinikanth: అది నా అలవాటు.. సీఎం యోగికి పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ వివరణ

  • సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ
  • యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ రజనీ వివరణ
  • జైలర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన సూపర్ స్టార్
Rajinikanth Explains Why He Touched Yogi Adityanaths Feet

లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. రజనీపై విమర్శలు వెల్లువెత్తాయి. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ ఈ మేరకు సమాధానం చెప్పారు. 2024 ఎన్నికలకు సంబంధించి మరో ప్రశ్న ఎదురవగా తాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘జైలర్‌’ను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News