currency notes: స్మార్ట్ ఫోన్ కవర్ లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

keeping currency notes in the phone cover dangerious
  • వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుందన్న నిపుణులు
  • ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • ఎమర్జెన్సీలో పనికొస్తుందని పెడితే ప్రాణమే పోవచ్చని వార్నింగ్

పొరపాటున పర్స్ మర్చిపోవడమో, దుస్తులు మార్చుకుని బయటకు వెళ్లినపుడో జేబులో డబ్బులు ఉండవు.. అలాంటి సందర్భాలలో పనికి వస్తుందనే ఉద్దేశంతో చాలామంది తమ ఫోన్లలోని బ్యాక్ కవర్ లో కరెన్సీ నోట్లు పెడుతుంటారు. ఈ అలవాటు మీకూ ఉందా.. అయితే, అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకోండి. ఎక్కువసేపు మాట్లాడినా.. ఛాటింగ్ చేసినా.. గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కడం చూసే ఉంటారు. ఫోన్ వాడకం ఆపేసిన కాసేపటికి వేడి బయటకు వెళ్లి ఫోన్ నార్మల్ గా మారుతుంది. అయితే, ఫోన్ కవర్ లో పెట్టిన కరెన్సీ నోట్లు ఈ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

కరెన్సీ నోట్ల తయారీలో వివిధ రసాయనాలు వేడిని పట్టి ఉంచుతాయని వివరించారు. దీనివల్ల ఫోన్ అమితంగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే.. అత్యవసరంలో ఉపయోగపడుతుందని మీరు దాచిన కరెన్సీ నోటుతో మీ ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మీ స్మార్ట్ ఫోన్ కు మరీ బిగుతుగా ఉండే కవర్ ను తొడగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News