Jagan: సీఎం జగన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్న నూతన ఎమ్మెల్సీలు కుంభా రవి, పద్మశ్రీ

New MLCs Kumbha Ravi and Padmasri met CM Jagan
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుంభా రవి, పద్మశ్రీ నియామకం
  • నేడు పదవీ ప్రమాణ స్వీకారం
  • ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

డాక్టర్ కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా నియమితులైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఇవాళ ఎమ్మెల్సీలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని ఏపీ శాసనమండలిలో చైర్మన్ మోషేన్ రాజు తన చాంబర్ లో పద్మశ్రీ, కుంభా రవిబాబులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పాల్గొన్నారు. 

నూతన ఎమ్మెల్సీలుగా పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. వారిరువురికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News