హిమాచల్ వరదలతో 74 మంది మృతి.. ఏకంగా రూ.10 వేల కోట్ల నష్టం
- వారం రోజులుగా హిమాచల్ లో భారీ వర్షాలు
- కొండచరియలు విరగడంతో భారీ ప్రాణ నష్టం
- పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు
ఇళ్లు, నివాస, వాణిజ్య సముదాయాలు, రహదారులు, వంతెనలు కుప్పకూలడంతో రాష్ట్రంలో 10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లో రాష్ట్రంలో 113 కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో, రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్లూడీ)కి రూ. 2,491 కోట్లు, జాతీయ రహదారుల సంస్థకి రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లింది. పర్యాటకుల రాక ఆగిపోవడంతో ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరువైంది.