honeytrap: మగువతో మగవారికి ట్రాప్.. ముఠా గుట్టు రట్టు

50 men blackmailed over sex videos Bengaluru Police busts racket
  • బెంగళూరులో ఓ ముఠా సాగించిన వ్యవహారం
  • మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో వీడియో చిత్రీకరణ
  • పెళ్లి చేసుకోవాలి లేదంటే డబ్బులు చెల్లించుకోవాలంటూ దోపిడీ
మహిళను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారం బెంగళూరులో వెలుగు చూసింది. మహిళతో హనీట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సంబంధిత ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అసలు నిందితురాలు పరారీలో ఉంది. పుట్టెనహళ్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాగా, ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ముగ్గురు వ్యక్తులతో పాటు నేహ అలియాస్ మెహెర్ అనే మహిళ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు టెలీగ్రామ్ ద్వారా మగవారిని ముగ్గులోకి దింపడాన్ని లక్ష్యం చేసుకున్నారు. కొత్త వారిని టెలీగ్రామ్ వేదికగా పరిచయం చేసుకుని, తనతో శృంగారానికి రావాలంటూ ఆమె ఆహ్వానించేది. ఆహ్వానం మేరకు వచ్చిన వారితో సాన్నిహిత్యంగా ఉంటున్న సమయంలో ముఠాలోని మిగిలిన ముగ్గురు వీడియో చిత్రీకరించే వారు. ఆ తర్వాత ఆ వీడియోని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవారు. 

ఆమెను పెళ్లి చేసుకుని, ఇస్లాంలోకి మారాలని కోరే వారు. లేదంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. ఇలా ఏడాదిన్నర కాలంలో రూ.35 లక్షల మేర వీరు బాధితుల నుంచి రాబట్టారు. సుమారు 50 మంది పురుషులు వీరి ట్రాప్ లో పడినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కీలక నిందితురాలు మెహర్ ముంబైలో ఉన్నట్టు లొకేషన్ ట్రాక్ చేశారు. ఆమెను ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.
honeytrap
Bengaluru
rocket
busted
men looted

More Telugu News