Rape convict: మధ్యప్రదేశ్ లో దారుణం.. సత్ప్రవర్తన కింద జైలు నుంచి బయటకు వచ్చి మరో చిన్నారిని చిదిమేసిన కామాంధుడు!

Rape convict out of jail for good conduct and again arrested for sexual assault
  • పదేళ్లు శిక్ష విధించగా ఏడేళ్లకు 2021లో బయటకు వచ్చిన నిందితుడు
  • సాత్నా జిల్లాలో మరో చిన్నారిపై అఘాయిత్యం
  • అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
మైనర్ పై అత్యాచారం చేసి జైలుకి వెళ్లివచ్చిన ఓ కామాంధుడు తన బుద్ధి ఏమీ మారలేదని నిరూపించాడు. ఇప్పుడు మరో చిన్నారిని చిదిమేశాడు. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో జరిగిందీ ఘోరం.

సాత్నా జిల్లాకు చెందిన రాకేశ్ వర్మ మైనర్ పై రేప్ కేసులో గతంలో పదేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. అయితే, జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని ఏడేళ్ల శిక్షా కాలం పూర్తవగానే విడుదల చేశారు. 2021లో జైలు నుంచి విడుదలైన రాకేశ్ వర్మ.. ఇటీవల మరో అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అక్కడ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. రక్తమోడుతున్న బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు.

బాలిక ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కాగా, నిందితుడు పూర్తికాలం జైలులో ఉంటే ఇప్పుడీ ఘోరం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు.
Rape convict
good conduct
exual assault
out of jail
Madhya Pradesh
satna

More Telugu News