BJP: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. నేరచరితులు, వారసులకే పెద్దపీట

BJP Released First List Of Chhattisgarh And Madhyapradesh Assembly Elections
  • త్వరలోనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
  • ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది.. మధ్యప్రదేశ్‌లో 39 మందితో తొలిజాబితా
  • అభ్యర్థుల్లో ఎక్కువమంది షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారే

త్వరలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.  వెనుకబడిన వర్గాల్లో పట్టుసాధించే ఉద్దేశంతో తొలి జాబితాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి సీట్లు కేటాయించింది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

గత ఎన్నికల్లో ఓటమి పాలైన 14 మంది అభ్యర్థులకు మరో చాన్స్ ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ వారసులతోపాటు నేరచరిత్ర ఉన్న వారికి కూడా టికెట్లు కేటాయించడం గమనార్హం. వీరిలో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రీతమ్ సింగ్ లోధీ, సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మొహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళా రావత్ తదితరులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News