Rajinikanth: యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసి ప్రశాంతత పొందిన రజనీకాంత్

Rajinikanth did dhyan in Yogananda Ashram
  • పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలను సందర్శిస్తున్న రజనీకాంత్
  • రాంచీలోని యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా
  • రూ. 500 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతున్న రజనీ చిత్రం 'జైలర్'

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో ఉన్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'జైలర్' రిలీజ్ కు ముందే ఆయన హిమాలయాలకు బయల్దేరారు. కరోనా మహమ్మారి కారణంగా ఆయన గత మూడేళ్లుగా హిమాలయాలకు వెళ్లలేదు. ప్రతి ఏటా హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఆయనకు చాలా ఏళ్లుగా అలవాటు. ఈసారి హిమాలయాలలోని ఆశ్రమాల్లో గడిపిన అనంతరం ఆయన వరుసగా పలు పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలను సందర్శిస్తూ వస్తున్నారు. బద్రీనాథుడిని కూడా దర్శించుకున్నారు. 

తాజాగా, ఝార్భండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న యోగానంద ఆశ్రమానికి రజనీ చేరుకున్నారు. అక్కడ ఆయన దాదాపు గంటసేపు ధ్యానం చేశారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న స్వాములతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగానే తాను ఆశ్రమానికి వచ్చినట్టు ఈ సందర్భంగా రజనీ తెలిపారు. అదే నగరంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకున్నారు.  ఇదే టూర్ లో ఆయన ఉత్తరాఖండ్ లోని ద్వారహట్ లో ఉన్న పాండవ్ కోహ్లీ గుహలో కూడా ధ్యానం చేసి, ప్రశాంతతను పొందారు. ఇక 'జైలర్' సినిమా విషయానికి వస్తే... రూ. 500 కోట్ల భారీ కలెక్షన్స్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News