Hyderabad: అతివేగంతో అనర్థం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి పడి యువతి దుర్మరణం

woman dies after falling from hitech city flyover after her bike collides with flyover wall
  • హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై ఘటన
  • బైక్‌పై యువతీయువకుల ప్రయాణం, బైక్ వేగంగా నడుపుతూ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన యువకుడు
  • వెనుక సీటుపై ఉన్న యువతి గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డ వైనం
  • గోడను ఢీకొన్న యువకుడికీ గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి 
  • మృతురాలిని కోల్‌కతాకు చెందిన స్వీటీగా గుర్తింపు
అతివేగం కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతున్న బైక్ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టడంతో వెనక సీటుపై ఉన్న యువతి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి దుర్మరణం చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 

కోల్‌కతాకు చెందిన స్వీటీ (22) తన స్నేహితుడు రాయన్ ల్యూకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు బైక్‌పై బయలుదేరింది. రాయన్ తన వాహనాన్ని వేగంగా నడపడంతో వాహనం అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ వెనుక సీటుపై కూర్చున్న స్వీటీ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడిపోయింది. రాయన్ గోడను బలంగా ఢీకొనడంతో అతడికీ గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా తీవ్రగాయాల పాలైన స్వీటీ చికిత్స పొందుతూ మ‌ృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Hitech City
Telangana
Crime News

More Telugu News