bhola shankar: రెమ్యునరేషన్ కోసం చిరంజీవి పట్టుబట్టారా?.. అసలు విషయం చెప్పిన నిర్మాత అనిల్ సుంకర

Rumors may satisfy the cruel fun of some people Anil Sunkara on Bhola Shankar
  • పుకార్లు వినోదాన్ని పంచవచ్చు కానీ కష్టపడిన వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని సూచన
  • తనకు, చిరంజీవికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో నిజంలేదని స్పష్టీకరణ
  • వ్యక్తిగతంగా కూడా మెగాస్టార్‌తో మంచి స్నేహం ఉందన్న అనిల్ సుంకర

సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కొంతమందికి వినోదాన్ని పంచవచ్చునేమో, కానీ కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్ఠను ఇలా దెబ్బతీయడం మాత్రం నేరమని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అన్నారు. చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా వచ్చిన భోళా శంకర్ విజయం సాధించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. చిరంజీవి రెమ్యునరేషన్ కోసం పట్టుబట్టడంతో అనిల్ సుంకర ఇల్లు, తోటలను విక్రయించవలసి వచ్చిందని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికే నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ ప్రచారాన్ని కొట్టి పారేసింది. తాజాగా అనిల్ సుంకర ట్విట్టర్ (ఎక్స్) వేదిక ద్వారా ట్వీట్ చేశారు.

పుకార్లు కొంతమంది వ్యక్తులకు క్రూరమైన వినోదాన్ని పంచవచ్చునని, కానీ ఎన్నో ఏళ్లుగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతాయన్నారు. తనకు, చిరంజీవికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. మెగాస్టార్ అన్ని విధాలా సహకరించే వ్యక్తి అన్నారు. సినిమాలపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తమ మధ్య మంచి స్నేహం ఉందన్నారు. నిజాలు కప్పిపెట్టి, విద్వేష వార్తలను ప్రసారం చేయవద్దని కోరారు.

ఫేక్ న్యూస్ సృష్టించడం కొంతమందికి సరదా అని, కానీ దీని ద్వారా దాంతో సంబంధం ఉన్న వారంతా ఇబ్బంది పడతారని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీస్సులతో మరింత బలంగా తిరిగి మీ ముందుకు వస్తామన్నారు.

  • Loading...

More Telugu News