30 గజాల దూరం నుంచి మెస్సీ కొట్టిన ఈ గోల్ ను చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.. వీడియో ఇదిగో!

Lionel Messi stunning goal in Leagues Cup
  • అమెరికాలో జరుగుతున్న లీగ్స్ కప్ టోర్నీ సెమీస్ లో మెస్సీ అద్భుతం
  • ఇంటర్ మియామీ క్లబ్ కు ఆడుతున్న మెస్సీ
  • ఈ టోర్నీలో ఇప్పటి వరకు 9 గోల్స్ చేసిన అర్జెంటీనా సూపర్ స్టార్
ప్రపంచ సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి కళ్లు చెదిరే అద్భుతం చేశాడు. అమెరికాలో జరుగుతున్న లీగ్స్ కప్ టోర్నీలో సూపర్ గోల్ చేశాడు. ఇంటర్ మియామీ క్లబ్ జట్టుకు ఆడుతున్న మెస్సీ... ఫిలడెల్ఫియా యూనియన్ క్లబ్ పై జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో స్టన్నింగ్ గోల్ చేసి, అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆట 20వ నిమిషంలో గోల్ పోస్ట్ కు 30 గజాల దూరం నుంచి గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్ లో 4-1 గోల్స్ తేడాతో విజయాన్ని సాధించి ఇంటర్ మియామీ క్లబ్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. మరోవైపు, ఈ టోర్నీలో 6వ మ్యాచ్ ఆడిన మెస్సీ ఇప్పటి వరకు 9 గోల్స్ చేశాడు. ఇంకోవైపు, గత ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీలో తన దేశం అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ లో బెస్ట్ ప్లేయర్ గా గోల్డెన్ బాల్ ను సాధించాడు.
Go Back to Shorts
Lionel Messi
Leagues Cup

More Telugu News