Bryan Johnson: కావాల్సినంత డబ్బుంది... ఇంతవరకు తోడు లేదు... ఓ సంపన్నుడి విచిత్ర గాథ!

The story of US millionaire Bryan Johnson
  • అమెరికాలో కోట్లు సంపాదించిన బ్రియాన్ జాన్సన్
  • కుర్రాడిలా కనిపించేందుకు ఏటా రూ.16 కోట్ల ఖర్చు
  • జీవితంలో ఇంకా ఒంటరిగా ఉన్న జాన్సన్
  • అమ్మాయిల ముందు 10 కండిషన్లు ఉంచుతున్న సంపన్నుడు
  • ఆ షరతులు చూసి పారిపోతున్న అమ్మాయిలు!
అతడి పేరు బ్రియాన్ జాన్సన్. అమెరికాలోని సంపన్నుల్లో అతడొకడు. తనకున్న అపారమైన సంపదతో అతడు ఏమైనా చేయగలడు. కానీ జీవితంలో ఇంతవరకు ఒక తోడును మాత్రం సంపాదించుకోలేకపోయాడు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ కుర్రవాడిలా కనిపించేందుకు ప్రతి ఏడాది రూ.16 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటాడు. 18 ఏళ్లప్పుడు తాను ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే కనిపించాలనేది అతడి తాపత్రయం. 

బ్రియాన్ జాన్సన్ ఆహారం పరంగా అత్యున్నతమైన జాగ్రత్తలు పాటిస్తాడు. పూర్తిగా నిపుణులు చెప్పిన సూచనలే పాటిస్తాడు. ఒక్క కెలోరీ శక్తి కూడా అదనంగా తన శరీరంలోకి వెళ్లడానికి వీల్లేదన్నట్టుగా అతడి ఆహారపు అలవాట్లు ఉంటాయి. నవయవ్వనం కోసం మద్యం కూడా మానేశాడు. ఇలాంటి వ్యక్తికి భాగస్వామి దొరక్కపోవడం అనేది ఒక విస్మయం కలిగించే అంశం.

అయితే, అతడి ఒంటరితనానికి అతడే బాధ్యుడు. ఎవరైనా తన జీవితంలోకి ప్రవేశించాలని వస్తే, వారి ముందు బ్రియాన్ జాన్సన్ 10 షరతులతో కూడిన చిట్టా ఉంచుతాడు. అందులోని నియమనిబంధనలు చూసి వచ్చిన అమ్మాయిలు కాస్తా పరార్! గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. 

ఇటీవల ఓ పోడ్ కాస్ట్ లో తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను పెట్టిన కండిషన్లకు ఏ అమ్మాయీ ఒప్పుకోవడంలేదని వాపోయాడు. జీవిత భాగస్వామి దొరకడం ఇంత కష్టమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.
Bryan Johnson
Millionaire
Age
Teenage
USA

More Telugu News