Actor Vijay: విజయ్, ధోనీ కాంబినేషన్ లో సినిమా?

Dhoni to act in Vijay movie
  • వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ తదుపరి చిత్రం
  • ఈ సినిమాలో ధోనీ కీలక పాత్ర పోషించబోతున్నట్టు ప్రచారం
  • అధికారికంగా వెలువడాల్సి ఉన్న ప్రకటన
తమిళనాడులో హీరో విజయ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సినిమా విడుదల సమయంలో వారు చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. మరోవైపు విజయ్ అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. 

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ తదుపరి చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఒక కీలకపాత్రను పోషించబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్, ధోనీ కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన వెలువడకపోయినా... విజయ్, ధోనీ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.
Actor Vijay
Kollywood
MS Dhoni

More Telugu News