Akshay Kumar: ఎట్టకేలకు అక్షయ్‌ కుమార్‌‌కు భారత పౌరసత్వం!

Akshay Kumar gets Indian citizenship shares proof on Twitter
  • అక్షయ్‌ కుమార్‌‌కు కెనడా పౌరసత్వం
  • కొన్నేళ్లుగా భారత పౌరసత్వం లేకుండానే ఉంటున్న అక్షయ్
  • తాజాగా తనకు సిటిజన్‌షిప్ వచ్చిందని ప్రకటించిన బాలీవుడ్ ఖిలాడీ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ రోజు నుంచి భారత పౌరుడు!! ఇదేంటి? ఇన్నాళ్లూ భారత పౌరుడు కాదా? అని అనుకుంటున్నారా? అవును మరి. కొన్నేళ్లుగా ఆయనకు ఇండియన్ సిటిజన్‌షిప్ లేదు. కేవలం కెనడా పౌరసత్వం మాత్రమే ఉంది. ఈ విషయంలో గతంలో అక్షయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తనకు భారత పౌరసత్వం వచ్చిన విషయాన్ని స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా అక్షయ్ ప్రకటించారు. భారత ప్రభుత్వం పంపిన డాక్యుమెంట్లను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. అందులో ‘అక్షయ్ హరి ఓమ్ భాటియా’గా ఆయన పేరు ఉండటం గమనార్హం. ‘‘హృదయం, పౌరసత్వం.. రెండూ హిందూస్థానీనే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్” అని బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ రాసుకొచ్చారు.
Akshay Kumar
Indian citizenship
Canada
Canadian citizen
Bollywood

More Telugu News