Soldier: సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన కుటుంబం... వీడియో ఇదిగో!

A Punjabi family welcomes young soldier with red carpet
  • సెలవులపై స్వగ్రామానికి వచ్చిన పంజాబీ యువకుడు
  • రోడ్డు నుంచి ఇంటి గేటు వరకు రెడ్ కార్పెట్
  • కవాతు చేస్తూ ఇంటి గేటు వరకు వచ్చిన యువ జవాను
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
దేశమాత కోసం వీరపుత్రులను కన్న గడ్డగా పంజాబ్ కు పేరుంది. సైన్యంలోనూ పంజాబీలకు ప్రత్యేకంగా ఓ రెజిమెంట్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి కుటుంబ సభ్యులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. 

గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలో ఉన్న తమ ఇంటి వద్ద  కారులో దిగిన ఆ యువ జవాను... రెడ్ కార్పెట్ పై కవాతు చేస్తూ ఇంటి గేటు వద్దకు రాగా, అక్కడ కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు కలగలిపి, పూలు చల్లుతూ భావోద్వేగభరిత స్వాగతం పలికారు. సైన్యంలో చేరిన తమ ఇంటివాడ్ని వారు ఆత్మీయంగానూ, గర్వంగానూ హత్తుకుని తమ హృదయ స్పందనను అతడికి వినిపించారు. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అంటూ అందంగా ముగ్గులు వేశారు.

 ఆ ఇంటి గేటు వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల కోలాహలం అంతా ఇంతా కాదు. సైన్యంలో పనిచేయడం ఎంతటి గర్వకారణమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
Soldier
Red Carpet
Welcome
Punjab
Video

More Telugu News