Rana Daggubati: సోనమ్ కపూర్ కు క్షమాపణలు చెప్పిన రానా దగ్గుబాటి

Rana Daggubati apologises to Sonam Kapoor for saying she wasted Dulquer Salmans time on The Zoya Factor
  • ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా రానా వ్యాఖ్యలు
  • దీంతో సోనమ్ కపూర్ కు వ్యతిరేకంగా ప్రచారం
  • తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రానా వివరణ
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల విషయంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కు క్షమాపణలు చెప్పారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా రానా చేసిన వ్యాఖ్యలతో సోనమ్ కపూర్ పై విమర్శలు పెరిగిపోయాయి. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం నడుస్తోంది. దీంతో రానా తన వ్యాఖ్యలపై మరోసారి స్పందించాల్సి వచ్చింది.

నిజానికి సోనమ్ కపూర్ పేరును రానా ప్రస్తావించలేదు. కానీ, సెట్స్ లో దుల్కర్ సల్మాన్ సమయాన్ని హిందీ హీరోయిన్ దుర్వినియోగం చేసిందంటూ రానా వ్యాఖ్యానించారు. దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ కలసి జోయా ఫ్యాక్టర్ లో నటించారు. తన వ్యాఖ్యలు చర్చకు దారితీయడంతో, రానా దీనిపై ట్విట్టర్ లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

‘‘నా వ్యాఖ్యల కారణంగా సోనమ్ కపూర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో ఇబ్బంది పడ్డాను. అది పూర్తిగా నిజం కాదు. నిజానికి అది తేలికగా తీసుకోవాల్సిన విషయం. స్నేహితుల మాదిరి మేము తరచూ సరదాగా ఆట పట్టించుకుంటాం. నా వ్యాఖ్యలు తప్పుగా అన్వయం అయినందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా సోనమ్ కపూర్ కు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. వారిద్దరినీ నేను ఎంతో గౌరవిస్తాను. తప్పుగా అన్వయానికి నా ఈ వివరణ ముగింపు పలుకుతుందని భావిస్తున్నాను’’ అని రానా వివరించాడు.
Rana Daggubati
Sonam Kapoor
apologises
Dulquer Salman

More Telugu News