Telugu Desam Party: దేవాన్ష్ తో కలసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత

Telugu Desam Party chief Nara Chandrababu Naidu along with his grandson Devansh unfurled the national flag
  • హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వేడుకలు
  • సిబ్బంది అందరికీ మిఠాయిల పంపిణీ
  • విజన్ ప్రకారం పనిచేస్తే ప్రపంచశక్తిగా భారత్ అవతరిస్తుందన్న అభిప్రాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ తో కలసి జాతీయ  జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుక హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద జరిగింది. జెండా ఆవిష్కరణకు ముందు చంద్రబాబు, ఆయన మనవడు దేవాన్ష్ మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కొబ్బరి కాయ కొట్టారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరిగింది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అక్కడున్న సిబ్బంది అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు.

మరోవైపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నేటి మన స్వాతంత్య్ర ఫలం ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితమేనన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, దేశ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. ఈ విషయంలో ఓ విజన్ ప్రకారం పనిచేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
Telugu Desam Party
Nara Chandrababu Naidu
Devansh
unfurled
national flag

More Telugu News