అతివేగం... అనర్థం! అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. వీడియో ఇదిగో!
- రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం సజ్జనార్ ట్వీట్
- తొందరగా వెళ్లాలనే ఆత్రం ప్రమాదానికి దారితీస్తుందంటూ హితవు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఓ ప్రమాదానికి సంబంధించినవి.. బైక్ పై ఓ యువకుడు మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పడం కనిపిస్తోంది. ఈ ప్రమాదం ఫ్లై ఓవర్ పై జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బైకర్.. మూలమలుపు వద్ద బైక్ కంట్రోల్ కాక డివైడర్ ను ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు ఫ్లై ఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. అక్కడితో ఈ వీడియో ఎండ్ అయింది. ప్రమాదం తర్వాత బాధిత యువకుడి పరిస్థితి ఏంటనే విషయం వీడియోలో కనిపించలేదు. ఈ విషయంపై సజ్జనార్ కూడా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది చెవినపెట్టరంటూ ఓ నెటిజన్ విమర్శించాడు.