siddu jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ

siddu jonnalagadda bommarillu bhaskar movie starts with pooja cermony
  • నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కొత్త చిత్రం
  • నిర్మాతగా  బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌
  • ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్న సిద్దు
‘డీజే టిల్లు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ దశ తిరిగింది. ఆ సినిమా తర్వాత అతనికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం డీజే టిల్లుకు కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో సిద్దు నటిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్దు హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నిన్న ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. మరో అగ్ర నిర్మాత దిల్‌ రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హీరోయిన్‌, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. బాపినీడు బి. సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయిప్రకాశ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
siddu jonnalagadda
Tollywood
bommarillu bhaskar
allu aravind
Dil Raju

More Telugu News