Lok Sabha: మోదీ ప్రభుత్వంపై వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం

No Confidence Motion defeated in the Lok Sabha
  • లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ్ గొగోయ్
  • మూడ్రోజుల పాటు వాడీవేడిగా లోక్ సభలో చర్చ
  • నేడు ప్రధాని నరేంద్ర మోదీ వివరణ
  • ఓటింగ్‌కు ముందే సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు
లోక్ సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష I.N.D.I.A. కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా.. ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.
Lok Sabha
no confidence motion
Narendra Modi

More Telugu News