ఈ పాపం అంతా జగన్ ప్రభుత్వానిదే: పురందేశ్వరి
- సర్పంచ్లు అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారన్న ఏపీ బీజేపీ చీఫ్
- పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం
- అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన
బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. ఈ పాపం అంతా జగన్ ప్రభుత్వానిదే అని ఆరోపించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపై మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా సర్పంచ్ల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. సర్పంచ్ల వ్యవస్థను అవమానిస్తున్నారన్నారు.