Vijay Devarakonda: వారిని చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతోంది: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda comments on marriage
  • ఈ మధ్య కాలంలో తన స్నేహితులు చాలా మంది పెళ్లి చేసుకున్నారన్న విజయ్
  • వారి జీవితాలను చూస్తుంటే తనకు కూడా పెళ్లి ఆలోచన కలుగుతోందని వ్యాఖ్య
  • పెళ్లిపై గతంలో ఉన్న అయిష్టం పోయిందన్న విజయ్
పెళ్లి గురించి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు తన వద్ద ఎవరూ పెళ్లి మాటే ఎత్తేవారు కాదని విజయ్ చెప్పాడు. అయితే ఈ మధ్య కాలంలో తన స్నేహితులు చాలా మంది పెళ్లి చేసుకున్నారని, వాళ్ల దాంపత్య జీవితాలను చూస్తుంటే తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతోందని తెలిపాడు. పెళ్లిపై గతంలో ఉన్న అయిష్టం పోయిందని చెప్పాడు. జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన చాప్టర్ అని అన్నాడు. మరో రెండు, మూడేళ్లలో తాను కూడా ఆ చాప్టర్ లోకి అడుగుపెడతానని చెప్పాడు. తన పెళ్లి విషయాన్ని ముందుగానే అందరికీ చెపుతానని అన్నాడు. కోలీవుడ్ లో తనకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారని, వాళ్లతో అవకాశం వస్తే సినిమాలు చేస్తానని చెప్పాడు. 

Vijay Devarakonda
Tollywood
Marriage

More Telugu News