Jakkampudi Raja: ప్రాంతాలు, కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: జక్కంపూడి రాజా

Jakkampudi Raja fires on Chandrababu
  • చంద్రబాబు రోడ్ షో ఫ్లాప్ అన్న జక్కంపూడి
  • బాబు సభల్లో జెండాలు ఫుల్, జనాలు నిల్ అని ఎద్దేవా
  • రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే కారణమని విమర్శ

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రోడ్ షో ఫ్లాప్ అని ఆయన అన్నారు. ఆయన పర్యటనలో జెండాలు ఫుల్ గా ఉంటాయని, జనాలు మాత్రం నిల్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక దుర్మార్గుడని, అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టమని అన్నారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణం కూడా చంద్రబాబేనని విమర్శించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడే నైతికత లేదని అన్నారు. 

చంద్రబాబు చేసిన తప్పులు, హైకోర్టు ఆదేశాల వల్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని రాజా తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. తాను రూ. 700 కోట్లు దోచేశానని టీడీపీకి సంబంధించిన పత్రికలో ఆరోపణలు చేయడం సరికాదని... తనకు రూ. 70 కోట్లు ఇస్తే తన ఆస్తులన్నింటినీ రాసిచ్చేస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News