Bonda Uma: పేర్ని నాని ఎవడు.. గొట్టంగాడు: బొండా ఉమా ఫైర్

Perni Nani is gottam gadu says Bonda Uma
  • చిరంజీవిని వైసీపీ నేతలు విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న బొండా ఉమా
  • చిన్న సలహా ఇస్తే చోటా, మోటా పకోడీగాళ్లంతా విమర్శిస్తారా? అని మండిపాటు
  • అందరూ గౌరవించే చిరంజీవి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటూ ఆగ్రహం
మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ నేతలు విమర్శించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, సూపర్ స్టార్ రజనీకాంత్ ను విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు చిరంజీవిని విమర్శించడంలో ఆశ్చర్యపోవడం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గురించి చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేముందని అన్నారు. అనవసరంగా సినీ పరిశ్రమ జోలికి ఎందుకు వస్తారని... రాష్ట్రానికి మంచి జరిగే పనులు చేయాలని మాత్రమే చిరంజీవి అన్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఒక చిన్న సలహా ఇస్తే చోటా, మోటా పకోడీగాళ్లంతా విమర్శిస్తారా? అని మండిపడ్డారు. 

చిరంజీవి వంటి గొప్ప వ్యక్తిని విమర్శించడానికి పేర్ని నాని ఎవడు... గొట్టంగాడు అని అన్నారు. అందరూ గౌరవించే చిరంజీవి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారా అని దుయ్యబట్టారు. సోనియాగాంధీ గురించి, ఇతర పాత విషయాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. 

Bonda Uma
Telugudesam
Chiranjeevi
Tollywood
YSRCP

More Telugu News