కాంగ్రెస్ పార్టీ తీరువల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు: ప్రధాని మోదీ
- ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదన్న మోదీ
- ఎన్డీయే కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు
- ప్రతిపక్షాలలో ప్రతిభావంతులను కాంగ్రెస్ అణచివేస్తోందని ఆరోపణ
కాంగ్రెస్ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ప్రధాని పీఠంపై కూర్చోలేకపోయారని మోదీ విమర్శించారు. ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు. వారంతా సమర్థులేనని, ప్రధాని పదవికి అర్హులేనన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఎన్డీయే కూటమిలో మాత్రం అలాంటి స్వార్థ రాజకీయాలకు చోటులేదని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కూటమిలో మిత్రపక్షాలు, వారి ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని మోదీ వివరించారు.