Piyush Goyal: పీయూష్ గోయల్‌పై I.N.D.I.A. కూటమి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

  • ప్రతిపక్షాలను ద్రోహులుగా పేర్కొన్నందుకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన కూటమి
  • పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని జైరామ్ రమేశ్ డిమాండ్
  • కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలపై తీవ్రంగా మండిపడిన పీయూష్
Privilege motion against Piyush Goyal in Rajya Sabha for calling Opposition traitors

ప్రతిపక్షాలను దేశద్రోహులుగా అభివర్ణించినందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. నేతలు మంగళవారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను పీయూష్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజ్యసభలో I.N.D.I.A. కూటమి పార్టీల సభ్యులను దేశద్రోహులు అని సంబోధించినందుకు సభా నాయకుడు పీయూష్ గోయల్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ఇచ్చాం. ఆయన క్షమాపణ చెప్పాలి' అని జైరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జైరామ్ రమేశ్ మరో ట్వీట్‌లో.. పరస్పర చర్చల తీర్మానం ఆధారంగా మణిపూర్‌పై తక్షణ చర్చకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా నిరాకరిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులపై పీయూష్ గోయల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు.

అంతకుముందు పీయూష్ గోయల్ రాజ్యసభలో ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలు చైనా మీడియాకు మద్దతిస్తున్నాయని, కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇది తీవ్రమైన అంశం అన్నారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అహంకారపూరిత సంకీర్ణ పార్టీలు ఒకదానికి మరొకటి సహాయం చేసుకుంటున్నాయని, దేశంపై దుష్ప్రచారానికి నిధులు సమకూరుస్తున్నాయన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి, చైనాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. వారు భారత్‌తో ఉన్నారా? చైనాతో ఉన్నారా? తెలుసుకోవాలన్నారు.

More Telugu News