హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న ఆలియా భట్
- ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆలియా
- హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగు పెడుతున్న నటి
- ప్రమోషన్స్ లో భాగంగా సహ నటి గాల్ గాడోట్‌తో తెలుగు మాటలు చెప్పించిన ఆలియా
ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆలియా తన సహనటి గాల్ గాడోట్‌కి తెలుగులో కొన్ని మాటలు నేర్పించి ఆకట్టుకుంది. గాడోట్ కూడా ఆలియా చెప్పిన తెలుగు పదాలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సమయంలో ఆలియా కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంది.