earthquake: దేశ రాజధాని ఢిల్లీలో కంపించిన భూమి

Afghanistan hit by earthquake tremors felt in Delhi NCR
  • ఆఫ్ఘనిస్థాన్ హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు
  • 195 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం 181 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) సహా పలు ప్రాంతాలపై పడింది. దీంతో ఇక్కడ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్ము కాశ్మీర్‌లోను 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
earthquake
India
New Delhi

More Telugu News