Ambati Rambabu: ఇదేంటి బ్రో!... పవన్ పై మరో ట్వీట్ చేసిన మంత్రి అంబటి

Ambati Ramababu condemns Pawan Kalyan comments on Punganuru issues
  • పుంగనూరులో నిన్న చంద్రబాబు పర్యటన రణరంగం
  • దాడులను ఖండించిప పవన్ కల్యాణ్
  • అధికార పార్టీ హింసాత్మక ప్రవృత్తికి నిదర్శనం అంటూ వ్యాఖ్యలు
  • దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో అంటూ అంబటి ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను జనసేనాని పవన్ కల్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. పుంగనూరులో జరిగిన పరిణామాలు అధికార పార్టీ హింసా ప్రవృత్తిని చాటేలా ఉన్నాయని పవన్ విమర్శించారు. మరోవైపు, టీడీపీ కార్యకర్తలే పోలీసులపై దాడి చేసి, వారిని గాయపరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా పవన్ వ్యాఖ్యలు చేయడాన్ని అంబటి ఖండించారు. 

"కానిస్టేబుల్ కొడుకువై ఉండి, పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తావా బ్రో!" అంటూ పవన్ ను అంబటి ప్రశ్నించారు.
Ambati Rambabu
Pawan Kalyan
Punganuru
YSRCP
Janasena
TDP
Police
Chittoor District

More Telugu News