Renu Desai: హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన రేణు దేశాయ్

Renu Desai petition in TS High Court against aqua marine park
  • హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం
  • ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ రేణు పిటిషన్
  • పోరాటం చేస్తున్న వారిలో మరికొందరు సెలబ్రిటీలు
సినీ నటి, దర్శకురాలు, సోషల్ యాక్టివిస్ట్ అయిన రేణు దేశాయ్ హైకోర్టు మెట్లెక్కారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని కొత్వాల్ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో ఆమె ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరికొందరు సెలబ్రిటీలతో కలిసి పోరాటం మొదలు పెట్టారు. ఆక్వా మెరైన్ పార్క్ ను ఆపాలంటూ పోరాడుతున్న వారిలో హీరోయిన్ సదా, శ్రీ దివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా తదితరులు కూడా ఉన్నారు.
Renu Desai
Tollywood
Hyderabad
Aqua Marine Park
TS High Court

More Telugu News