‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్.. 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ భారీ ఫైట్
- భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి
- శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
- చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా
సినిమా క్లైమాక్స్ ఫైట్స్ చిత్రీకరణ ఈ మధ్యే పూర్తయింది. దాదాపు 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఈ యాక్షన్ సీక్వెల్స్ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే వారం మొదలవనుంది. భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.