Team India: రాణించిన భారత బౌలర్లు... పూరన్, పావెల్ మెరిసినా విండీస్ కు స్వల్ప స్కోరే!

Team India bowlers restrict WI despite Powel and Pooran power hitting
  • టీమిండియా-వెస్టిండీస్ తొలి టీ20
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు
  • రాణించిన రోవ్ మాన్ పావెల్, నికోలాస్ పూరన్
  • అయినప్పటికీ భారీ స్కోరు సాధించలేకపోయిన విండీస్
  • చెరో రెండు వికెట్లతో విండీస్ ను దెబ్బకొట్టిన చహల్, అర్షదీప్
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. 

కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ (32 బంతుల్లో 48 పరుగులు), నికోలాస్ పూరన్ (34 బంతుల్లో 41) రాణించినా... విండీస్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. 

అది కూడా చివర్లో విండీస్ బ్యాటర్లు కాస్త ధాటిగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చివరి 5 ఓవర్లలో విండీస్ 42 పరుగులు సాధించింది.

ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ (1), జాన్సన్ చార్లెస్ (3), షిమ్రోన్ హెట్మెయర్ (10) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో చహల్ 2, అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
Team India
West Indies
1st T20
Trinidad

More Telugu News