Hyderabad: హైదరాబాద్ చరిత్రలో రికార్డ్... కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు, కొనుగోలు చేసిందెవరంటే..!

Kokapet land prices soar ups to RS 100 crore for one acre
  • నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లలో వేలం
  • ప్లాట్ నెంబర్ 10లో ఏకంగా రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర
  • కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీ 
  • ఈ-వేలం ద్వారా వచ్చిన రూ.1,532 కోట్ల ఆదాయం
కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఇక్కడి నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో భూముల ధర హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. అయితే ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దీంతో చరిత్రలోనే అత్యధిక ధర నమోదయింది.

ప్లాట్ నెంబర్ 10లో 3.6 ఎకరాలు ఉండగా, ఈ-వేలం ద్వారా రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ భూమిని కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీగా తెలుస్తోంది. ప్లాట్ నెంబర్ 9లో ఎకరాకు రూ.76.5 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా, ఎకరం ధర అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది. ఇక గజం ధర సరాసరిని 1.5 లక్షలు పలకడం విశేషం. నియో పోలిస్ ఫేజ్ 2లోని ఈ నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,532.20 కోట్ల ఆదాయం సమకూరింది. 45 ఎకరాలలో వున్న 7 ప్లాట్లకు ప్రభుత్వం రూ.2500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. నేటి తీరు చూస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లాట్ల వేలంలో షాపూర్ జీ పల్లోంజీ, ఎన్సీసీ, మైహోం, రాజ్ పుష్పా తదితర రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
Hyderabad
kokapet
land
Real Estate

More Telugu News