Team India: టీమిండియా-వెస్టిండీస్ తొలి టీ20... ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన చహల్

Chahal strikes as WI lost openers in a single over
  • టీమిండియా, విండీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు తొలి టీ20
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ నేడు ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కు ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి విండీస్ ను దెబ్బకొట్టాడు. ఓపెనర్లు కైల్ మేయర్స్ (1), బ్రాండన్ కింగ్ (28)లను చహల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. అనంతరం, కుల్దీప్ యాదవ్ కూడా ఓ వికెట్ తీయడంతో విండీస్ మూడో వికెట్ చేజార్చుకుంది. విండీస్ వికెట్ కీపర్ జాన్సన్ చార్లెస్ (3) కుల్దీప్ బౌలింగ్ అవుటయ్యాడు. 

ప్రస్తుతం విండీస్ 8 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 61 పరుగులు చేసింది. నికోలాస్ పూరన్ 27, రోవ్ మాన్ పావెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ ద్వారా తెలుగుతేజం తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు.
Team India
West Indies
1st T20
Trinidad

More Telugu News